సీతాఫలాల కోసం వెళ్ళిన వ్యక్తి మృతి..బిజినపల్లి పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదని ఫిర్యాదు..బుద్ధారం శివారులో తిక్కన మృతదేహం
అక్షరవిజేత,ఉమ్మడి గోపాల్పేట్:
సీతాఫలాల కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిన ఘటన బుద్ధారం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది గోపాల్పేట్ పోలీసుల వివరాల ప్రకారం డేగ తిక్కన్న (78) నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అల్లిపురం గ్రామానికి చెందిన ఇతను 14-9-2025 రోజున ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి సీతాఫలాల కోసం వెళుతున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాకపోవడంతో బిజినపల్లి పోలీస్ స్టేషన్లో తండ్రి కనిపించడం లేదని డేగ బరసావులు 15-9-2025 ఫిర్యాదు చేయడం జరిగింది. గురువారం ఉదయం వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల పరిధిలోని బుద్ధారం శివారులోని వంగూరు భగవంతు పొలం దగ్గర తన తండ్రి చనిపోయి ఉన్నాడని తెలిసి వచ్చి ఫిర్యాదు చేశాడు. తన తండ్రికి కరెంటు షాక్ తగిలి చనిపోయి ఉంటాడని అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని వారు తెలియజేశారు